EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • శ్రీరామ్ ఫైనాన్స్ లో భారీ మోసం.లోన్ తీసుకోకున్నా.. 20 లక్షల రుణం..!ఖాతాదారుడి లబోదిబో!..

    Author P శివశంకర్ | 22 Oct 2026, 02:54 PM | TELANGANA
    శ్రీరామ్ ఫైనాన్స్ లో భారీ మోసం.లోన్ తీసుకోకున్నా.. 20 లక్షల రుణం..!ఖాతాదారుడి లబోదిబో!..

    చేర్యాల బ్రాంచ్‌లో వెలుగుచూసిన ఫైనాన్స్ సంస్థ నిర్వాకం.. బాధితుడు చంద శ్రీకాంత్ ఆవేదన
    ​

    సిబిల్ స్కోర్ పతనమై బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి.. ప్రశ్నిస్తే మేనేజర్, డీఎంల నిర్లక్ష్యపు సమాధానాలు
    ​

    ఇలాంటి ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల అనుమతులు రద్దు చేసి క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్
    ​చేర్యాల (హిందుస్థాన్ మీడియా):
    సాధారణ ప్రజలను, అమాయకులను లక్ష్యంగా చేసుకుని ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు చేస్తున్న మోసాలు చేర్యాల పట్టణంలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. చేర్యాల పట్టణ కేంద్రంలోని శ్రీరామ్ చిట్ ఫండ్స్ / ఫైనాన్స్ కంపెనీలో ఒక వ్యక్తి పేరుపై ఆయనకు ఏమాత్రం తెలియకుండానే ఏకంగా రూ. 20 లక్షల మేర భారీ బిజినెస్ లోన్ సృష్టించిన వ్యవహారం తాజాగా బట్టబయలైంది. చేర్యాలకు చెందిన చంద శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం.. తాను శ్రీరామ్ చిట్ ఫండ్ లేదా ఫైనాన్స్ సంస్థలో ఎటువంటి వ్యాపార లేదా వ్యక్తిగత రుణం తీసుకోలేదు. కానీ, తన సిబిల్ (CIBIL) రికార్డులను పరిశీలించగా జూన్ 2023 నుంచి తన పేరుపై 'శ్రీరామ్ ఫైనాన్స్'లో రూ. 20,00,000 అన్‌సెక్యూర్డ్ బిజినెస్ లోన్ శాంక్షన్ అయినట్లు, అందులో ఇంకా రూ. 11 లక్షలకు పైగా బ్యాలెన్స్ ఉన్నట్లు స్పష్టంగా చూపిస్తోంది.
    ​ఈ అనధికార రుణ నమోదు కారణంగా తన సిబిల్ స్కోర్ పూర్తిగా పడిపోయిందని, ఇతర బ్యాంకుల్లో అత్యవసర అవసరాల నిమిత్తం రుణాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోగా అవి తిరస్కరణకు గురవుతున్నాయని బాధితుడు కన్నీటిపర్యంతమయ్యాడు. దీనిపై నిలదీసేందుకు చేర్యాల స్థానిక శ్రీరామ్ బ్రాంచ్ కార్యాలయానికి వెళ్లి బ్రాంచ్ మేనేజర్‌ను, డివిజనల్ మేనేజర్ (డీఎం)ను సంప్రదించగా వారి నుంచి బాధ్యతారాహిత్యమైన, నిర్లక్ష్యపు సమాధానాలు ఎదురయ్యాయని వాపోయాడు. కనీసం సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయకుండా తప్పించుకునే ధోరణి ప్రదర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కేవలం తాను మాత్రమే కాదని, స్థానికంగా ఆరా తీయగా ఇలాంటి ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల వల్ల మోసపోయిన బాధితులు ఇంకా చాలామంది ఉన్నట్లు సమాచారం ఉందని పేర్కొన్నాడు. సామాన్యుల గుర్తింపు కార్డులు, వ్యక్తిగత పత్రాలను దుర్వినియోగం చేస్తూ రుణాలు తీసుకోకపోయినా తీసుకున్నట్లు తప్పుడు రికార్డులు సృష్టించి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి ప్రైవేట్ కంపెనీల గుర్తింపు, అనుమతులను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని, బాధ్యులైన సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని బాధితుడు చంద శ్రీకాంత్ ఉన్నతాధికారులను, ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు.
    ​– | హిందుస్థాన్ మీడియా |
    సామాన్యుడి నేస్తం 📰

    శ్రీరామ్ ఫైనాన్స్ లో భారీ మోసం.లోన్ తీసుకోకున్నా.. 20 లక్షల రుణం..!ఖాతాదారుడి లబోదిబో!.. - Additional Image