EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చేర్యాలలో ఘనంగా జాతీయ మాల మహానాడు 20వ ఆవిర్భావ దినోత్సవం

    Author P శివశంకర్ | 27 Oct 2026, 03:21 PM | TELANGANA
    చేర్యాలలో ఘనంగా జాతీయ మాల మహానాడు 20వ ఆవిర్భావ దినోత్సవం

    అంబేద్కర్‌ ఆశయాలు, రాజ్యాంగ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం: బుట్టి సత్యనారాయణ
    చేర్యాల, హిందుస్థాన్ మీడియా: సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో జాతీయ మాల మహానాడు 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి, సంఘం జెండాను ఆవిష్కరించారు.
    కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమంతో పాటు తెలంగాణ ఉద్యమం, పలు సామాజిక ఉద్యమాల్లో జాతీయ మాల మహానాడు కీలకంగా పనిచేసిందని పేర్కొన్నారు. అంబేద్కర్‌, మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రాజ్యాంగ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు శ్రీరాం మలయ్య, కాటం సత్తయ్య, జిల్లా ప్రచార కార్యదర్శి మేడిపల్లి నరసింహ, డివిజన్ అధ్యక్షుడు చింతల విజయ్ కుమార్, నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీరాం వెంకటేష్, సిద్దిపేట జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి చంద్ర శ్రీకాంత్, యువజన నియోజకవర్గ ఇన్‌చార్జి పాకనటి భాస్కర్, చేర్యాల పట్టణ అధ్యక్షుడు పుట్ట రాజు, పట్టణ మహిళా అధ్యక్షురాలు గుస్క వాసంతి, యువజన పట్టణ అధ్యక్షుడు బుట్టి సాయికుమార్, మండల నాయకులు గుస్క వెంకటేష్, మద్దూరి కనకయ్య, పుట్ట ఐలయ్య, బుట్టి శ్రీనివాస్, యనమల్ల యాదమ్మ, కాటం బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

    చేర్యాలలో ఘనంగా జాతీయ మాల మహానాడు 20వ ఆవిర్భావ దినోత్సవం - Additional Image