EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చేర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

    Author THADEM PRASHANTH | 30 Oct 2026, 02:26 PM | TELANGANA
    చేర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

    ప్రోగ్రామ్ 6.0 లో భాగంగా శానిటేషన్ డ్రైవ్.. కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు
    ​

    ఉత్తమ సేవలందించిన ఐదుగురు పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం
    ​

    హాజరైన మున్సిపల్ అధికారులు, మహిళా శిశు సంక్షేమ శాఖ బృందం, కౌన్సిలర్లు
    ​చేర్యాల (హిందుస్థాన్ మీడియా):
    కేంద్ర ప్రభుత్వ మహిళా, శిశు సంక్షేమ శాఖ సూచనల మేరకు, సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ముమ్మర పారిశుద్ధ్య పనులు చేపట్టారు. 'ప్రోగ్రామ్ 6.0' లో భాగంగా మున్సిపల్ శానిటేషన్ సిబ్బందితో కార్యాలయ పరిసరాలను శుభ్రం చేయించి, పిచ్చి మొక్కలను తొలగించి బ్లీచింగ్ పౌడర్ పిచికారీ చేయించారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, పరిశుభ్రమైన వాతావరణం ఉండేలా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.
    ​ఈ సందర్భంగా విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసి ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఐదుగురు పారిశుద్ధ్య కార్మికులను అధికారులు, ప్రజాప్రతినిధులు శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు. సమాజ ఆరోగ్యాన్ని కాపాడటంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర వెలకట్టలేనిదని అధికారులు కొనియాడారు.
    ​ఈ కార్యక్రమంలో చేర్యాల మున్సిపల్ కమిషనర్ అభిలాష్, సబ్ రిజిస్ట్రార్ మనోహర్, మున్సిపల్ మేనేజర్ ప్రభాకర్, సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం నుండి మహిళా శిశు సంక్షేమ శాఖ సీడీపీవో రమాదేవి, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ (ఆర్థిక అక్షరాస్యత నిపుణులు) శివంది నాగరాజు, స్థానిక కౌన్సిలర్లు గీతాంజలి, కొమ్ము రాజేశ్వరి, సుప్రజతో పాటు అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, టీచర్లు, మున్సిపాలిటీ శానిటేషన్ సిబ్బంది, రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
    ​– | హిందుస్థాన్ మీడియా |
    సామాన్యుడి నేస్తం 📰

    చేర్యాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు - Additional Image